Saturday, July 9, 2011

సింహపురి కధలు:కలి పురుషుడు ఎలా వుంటాడు సరోజా?


 పొద్దునే లేచి సంద్యా వందనం చెస్తుండగా భాగవత ఆరంబ గట్టాలు గుర్తుకు వచ్చాయి.వెంటనే వ్యాస భగవానుడు ,పరీక్షిత్ మహరాజు గ్నప్తికి వచ్చారు.కలిపురుషుని ఊహా చిత్రం మటుకు మనసుకి అందలేదు.కలి పురుషుడు ఎలా వుండి వుంటాడంటావ్ అని సరోజను అడిగితే ,రోజూ వుండే నసే అంటూ ఊరగయి జాడిలో పెట్ట సాగింది.పెళ్ళిల్లు చేయిస్తున్నా పూజలు చేయిస్తున్న ఆ ప్రస్న మటుకు నన్ను వేదించింది.వో వారం రొజులు తిండీ సరిగ్గా తినలేదు నిద్రా వేలకు పోలేదు.


అదే ద్యాసలో పరమాత్మను దూషిస్తూ పక్క వూరిలో పెళ్ళి చేయించి నా 1975 లూనా లో ఇంటికి బయలు దేరాను.ఎదో ఇన్ని రోజులూ సేవించింది కదా అని పాత బడినా దాన్ని మార్చలేదు.ఇంటి సందు మలుపు దగ్గర వున్నటుండి వో కుర్రవాడు ఒక చేత్తో ఫోను మాట్టడుతూ మరో చేత్తో మొటారు సైకిల్ నడుపుతూ రోడ్డుకి తప్పు వైపు నాకేసి దూసుకు వచ్చాడు.సమయానికి బ్రేకు వేసి ప్రమదం తప్పి చిన్న గాయాలు అయ్యాయి.ఆ కుర్రవాడి బైకు ఇటు వుండాల్సింది అటు తిరిగింది.

 

నేనేదో ముసలి వాడిని,నాకు ఎమన్నా అయితే వో రెండు మూడు నెలలు మంచాన పడుతాను.కుర్రాడివి,అసలే పరీక్షల సమయం, ని కాలో చెయ్యో విరిగితే ఒక విద్యా సంవస్తరం వ్రుదా అయ్యిపోదు.కాస్తా నిదానంగా పోవచ్చుగా.

 

బా చెప్పావ్ లే పో పోవయ్య .నేను కష్టపడి బ్రేక్ వేసి బ్యాలెన్సు చేసి తప్పిస్తే పెద్ద క్లాసు పీకుతున్నావ్.ఒకరికి చెప్పవలసి వస్తే ప్రతి ఒక్కరు వేద వ్యాసులే అంటూ బైకు కిక్కు కొట్టాడు..
 


నేను ఇంకేమి మాట్లాడలేదు.చిరు నవ్వు నవ్వి నేరుగా ఇంటికి వెల్లాను.బండి స్టాండు వేసి కడుపు నిండా బోంచేసి కునుకు తీస్తూ సరొజకు కలి పురుషుడి దర్సనం అయ్యిందని ఆనందంగా చెప్పాను.