ముంగిట సంక్రాంతి ముగ్గునుంచి,టెంకాయి చెట్లు ,ఎర్ర పంచ, వెనక బర్రెల కొట్టాం తో ఎప్పుడూ బ్రుందావనం లా ప్రసాంతంగా వుండే మా ఇళ్ళు ,సెలవులకి బావలు ఇద్దరు వచ్చిన వెంటనే హనుమంతుని విసిట్ తరువాత లంకలా తయారయ్యింది.కోతి బావకి పెల్లంటా అనే పాట విన్న ప్రతి సారి నాకు వాల్లే గుర్తుకు వస్తారు.వాల్లిదరిలో ఎవరిని చేసుకుంటావ్ అని వూరిలో వారు అడిగితే ,వాల్ల ఇద్దరిని తప్పా ఎవరినైనా చేసుకుంటాను అని చెప్తాను.
చిన్నపుడు నన్ను భయపెట్టాలని సరదాగ బాత్ రూంలో పంపి బయట నుంచి చిలుకు వేసారు.వాల్లకి తెలియకుండా లోపల నుంచి నేను గొల్లెం వేసి తియ్యడం రాక ఏడ్వడం మొదలెట్టాను.అత్తమ్మ నేను బయటకు వచ్చేవరకు ఆగి వాల్ల వీపులు విమానం మోత మోగించింది.
మరో సారి నాటు కోడి గుడ్లతో ఆంలేట్ వెయ్యాలని వడ్ల గంపలోకి నన్ను దింపారు .పంది కొక్కుల కోసం అమర్చిన ముల్ల కంపపై కాలు వేసాను.నేను అరగంట ఏడిస్తే వాల్లు నానమ్మ దెబ్బలకు రోజంత ఎడ్చారు.
టినేజీ మొదలయినప్పటి నుంచి వూరికి వచ్చిన ప్రతి సారి వాల్లకి కల్లు తాగాలనే కోరిక.కాని వింజమూరులో కాని చుట్టుపక్కల వూర్లలో గాని తాతయ్యకు తెలిసిన వారు చూస్తారనే భయం.
దసరా వేషగాడిని పిచ్చి కుక్క తరిమి నట్టు పరిగెత్తు కొచ్చాడు మస్తాన్.సుగ్రీవుడికి హనుమంతుడిలా వీల్లకి మస్తాన్.ఎదో గుస గుస లాడారు.వెంటనే మస్తాన్ గాడి హిరో సైకిల్లో ముగ్గురు కలసి తుర్రు మన్నరు.పాముల బాయి తోట లోంచి మామిడి కాయలు,చరువు గట్టు దగ్గర నుంచి చింత కాయలు ,యానదయ్యకు చెప్పి లేత తాటికాయలు కొయ్యించి మద్యాహ్నానికి ఇంటికి చేరారు.
సీనూ బావ చింతకాయలు నూరుతుంటే,విష్నూ బావ తాటి ముంజలు తీసి చిల్లు పొడిచి వో గిన్నెలో వేసాడు.ఇంతలో మస్తాన్ మజ్జిగ తెచ్చి మామిడికాయలు ముక్కలుగా కోసాడు.ఎం చేస్తున్నరు అని అడిగినా అక్కడ నేనొక దాన్ని అసలు లేనట్టే నూరిన చింతకాయలు కోసిన తాటికాయలు,మామిడి కాయ ముక్కలు గిన్నెలో వేసి దాంట్లో మజ్జిగ పోసారు.
నాకు కొంచ్చెం ఇమ్మంటే నిద్ర లేచాక ఆలోచిస్తామంటూ దాన్ని ఫ్రిజ్జులో లోపల వుంచి కునుకు తీసారు.అదెలా వుంటుందో తెలుసుకోవాలనే ఆత్రుతతో ఫ్రిజ్జు తలుపు తెరిచాను ఫ్రిజంతా ఎదో కంపు . కూర చెడిందేమో అని,వెంటనే నానమ్మను పిలిచాను.బావలు పెట్టిన గిన్ని తెరచిన నానమ్మ వెంటనే బర్రెల కొట్టాం లోకి పెరిగెత్తి గిన్నెను కుడితి తొట్టిలో బోర్లించింది.
నిద్ర లేచిన బావలు విషయం తెలసి చిరాకు పడ్డారు.అటు నానమ్మను అడగ లేరు.ఇటు కుడితి తొట్టిలో మూతి పెట్టలేరు.అసలు అదేంటో తెలుసు కోవడానికి మాకు పెద్ద సమయం పట్టలేదు.సాయంత్రం పాలు పితకడానికి వెల్లిన బసవమ్మను తాగుబోతులా వూగుతూ వెనక కలుతో ఈడ్చి తన్నాయి బర్రెలు.మరుసటి రోజు పాల కోసం ఎదురు చూసారు కోతి బావలు.