Wednesday, July 20, 2011

ప్రేమ - జిందగీ


నా గావు కేకకి బయపడి మేడపై కొత్తగా అద్దెకు దిగిన వాల్లు సపరివార సమేతంగా పరిగెత్తు కొచ్చారు.అప్పుడు నా వయసు రెండు సంవస్తరాలు.మొదటి సారి అమ్మా నాన్నా నన్ను అమమ్మ దగ్గర వదిలి ఫస్టు షో సినిమాకని వెల్లారు.ఆ విషయం నాకు నాన్న స్కూటరు సెబ్దం వినబడ్డాక కాని తెలియలేదు.అమ్మా అమ్మా అంటూ మొదలెట్టిన నా ఏడుపు కుక్కరు విజిల్ లా గుక్క స్తాయికి చేరి,అమమ్మ కాడ్బరీ చాక్లేటు చూపిన వెంటనే ఆగి పోయింది.

బాబ్ కట్టు,పొటి స్కర్ట్టు తో స్కూల్ డ్రస్సు లో కూడ యువరాణి లా వున్న ఆ పిల్ల పేరు కీర్తి .ఆ పిల్ల అంటే నాకు ఫస్టు క్లాసు నుంచే ఇష్టం.తన లాగే తన చేతి రాత లోని ప్రతి అక్షరమూ అందంగా వుంటాయి.అమ్మని ,చెల్లిని ఇస్ట పడడం లా కాకుండా ఇది వేరైన అనుభూతి.ఎక్కడ మొదలయిందో తెలియదు.బహుసా అయిదో తరగతి లో వో సారి క్లాసు లోంచి బయటకు వస్తున్నప్పుడు చూసుకోకుండా ఇద్దరం ఒకరికొకరు తగిలినప్పుడో? ఆబ్సెంట్టు వంకతో తన నోట్బుక్ అడిగి తీసుకున్నపుడు తన చేతి స్పర్స లోనో?.దాన్ని ప్రేమ అంటారని సినిమాలు చూసి తెలిసిందో ? తెలిసాక సినిమాలు చూసానో?

నా పైన నాకే కోపం ,అసహ్యం,అసహనం.ఎదురుగ్గా వున్నాన్ని రోజులూ ఎన్నో సార్లు నాతో రక రకాలుగా తన ప్రేమను చెప్పాలని చూసినా, నెనే చెప్పనివ్వలేదు.ప్రతి రోజు ,ప్రతి పూట నా గొంతు వినబడగానే ఇంటి బయటకు పరిగెత్తుకు వచ్చి నన్నే చూస్తూ నేను పట్టించుకోక పొయినా అలా నిలబడిపొయ్యేది.ఎదో ఒక వంకతో మా ఇంటికి వచ్చి , నన్ను చూసిన ప్రతి సారి నేను చూడక పొయ్యినా తన వైకరి మారలేదు.ఇంత దూరం ఈ దేశం గాని దేశం వచ్చాక గాని తెలియలేదు తన ప్రేమ విలువ .

అసలు ఈ సమాజానికి ఎందుకు భయపడాలో అమెరికా నుంచి తిరిగి వచ్చిన నాకు అర్దం కావట్లేదు.కాస్త సమయం ఇచ్చి,ప్రేమగా మాట్టాడితే అర్దం చేసుకుంటారెమో?.ఈ ప్రస్నకు బదులిచ్చే సమయం, ఓపికా నాకు లేవు.ఇప్పుడు నా ఆలొచన అంతా మా పెళ్ళి గురించే.వెంటనే జరిగి పొయ్యి మేమిద్దరం ఒక్కటైపోవాలి.ఏది తప్పో ఏది వొప్పో నా అంతరాత్మకి తెలుసేమో,అది తిరిగి నన్ను ప్రస్నించే రోజుకి దానికి ,ఈ సమాజానికి కలపి సమాదానం చెప్పగలిగే ఎత్తుకి మేము ఎదిగి పోతాము.

నాతో కలసి ఏడు అడుగులు వేసిన క్షనం నుంచి నా ప్రతి అడుగులో తోడుగా వుంటూ అటు ఇంటి పని ఇటు ఆఫీసు పని తో పాటు పిల్లల బాద్యత కూడ తనే తీసుకొని ,చిన్ని చిన్ని విషయాలకు చిరాకు పడే నా మాటలు అలసిపొయ్యి కూడా ఓపికగా వినే తనని చూసినప్పుడల్లా ,అది తన కర్మో ? నా పూర్వ జన్మ పున్యమో ? అనే ప్రస్నలు నా మనసుని కదిలిస్తాయి.

సమయం ఏడు గంటలు కావొస్తోన్నా,నన్ను హాస్పిటల్కు తీసుకు వెల్లటానికి రిషి ఇంకా రాలేదు.ఆఫీసులో ముక్యమయిన పని వుండి వుంటుంది.వాడిని అల్లారు ముద్దుగా పెంచాము.చదువులకి ఎంత కర్చు అయినా ఎప్పుడూ వాడిని వూరు దాటనివ్వ లేదు.వాడి లాగే నా మనవడు నిషాంత్ కి కూడ నేనంటే ఎంతో ప్రేమ.మూడు నెలలకోసారి వచ్చినప్పుడల్లా తాతయ్యా తాతయ్యా అంటూ న చుట్టూతా తిరుగుతాడు.

 ఐ.సి.యు అద్దం లోంచి అయిన వాల్లందరు దిగాలుగా చూస్తున్నారు.నా పిల్లల పెళ్ళిలకి రాని బందువులు కూడా  వచ్చారంటే ఇవ్వి వాల్లకి ఆకరి చూపులేమో అన్న ఆలోచనకి నా బి.పీ రీడింగు పెరిగిపోతోంది.ఈ ఒక్క సారికి గండం గట్టెకేస్తే బవున్ను.ఈ ఒక్క సారికి ప్రానం నిలచి హాస్పిటల్ నుంచి త్వరగా బయట పడితే బావున్ను.అయినా ఇన్ని రకాల ప్రేమలు లెక్క చెయ్యని మరనం నా ప్రాన ప్రీతిని లెక్క చేస్తుందా?