Sunday, May 15, 2011

బలే నవాబు - ఒక్క ఐడియా అందరి జీవితాల్ని మార్చేసింది


సింహపురి మహా నగరం, కోవూరు మండలం - 1993 లో వో బలే రోజు...

కబీర్ దాసు గారి పద్యాలను - కల్ కరే సో ఆజ్ కర్  అంటూ ఫాలో అవుతూ,రెపటి జిందగీ ఆజ్ హి జియో అనే సూత్రంతో - హుందాగా ,దర్జా గా కనిపిస్తూ అందరినీ సలామా లేకుం అంటూ సరదాగా పలకరిస్తూ ,ప్రతి రోజు రంజాన్ పండుగలా బలేగా గడిపేస్తుంటారు అబ్దుల్లా నవాబు గారు.జహాపనా ఇంట్లో వారిని వీదిలో వారిని ఎప్పటి కప్పుడు బలే ఐడియాలతో ఆస్చర్య పరుస్తూ వుండేవారు. వో సారి వున్నటుండి ఎం.ఎల్.ఆ ఎలక్షన్లలో నిలబడ్డారు.ఏది చేసినా కిక్ సంగతి ఎమో గాని చెక్కు మటుకు బారి గానే వుండేది.ఏనుగు గుర్తుకే మీ వోటు అని వూరుకోకుండా ,ప్రచారానికి వో సర్కస్ ఏనుగుని నెల రోజులకు అద్దెకు తెచ్చి మరీ ఊరంతా తిప్పేసారు.ఎలెక్షన్లలో గెలవకపోయినా నవాబు గారికి ఊరిలో పలుకుబడి బాగా పెరిగిపోయింది.

మరో సారి అలానే బేటీ నిక్కా కి రెహ్మాన్ ఆర్కెస్ట్రా పక్కా అనే బలే ఐడియాతో సంచలనం స్రుష్టించాడు.మొత్తానికి రెహ్మాన్ రాలేకపోయినా శివ మణి మేల వాయిద్యాలతో అతిదులను అనంద పరిచాడు.

ఇలాంటి ఐడియాలు పదే పదే రావటానికి ఆయనకు వున్న ఒకే ఒక ధైర్యం అయన కోట.అది కలిసొచిందని కొందరంటే ,కబ్జా చేస్తే వచ్చిందని చాల మంది అనేవారు.ఏది అయితే ఏమి అది వో ప్రభుత్వ బ్యాంకుకి అద్దెకు ఇచ్చారు. నెల నెలా అద్దెతో పాటు నవాబు గారి పలుకు బడి చూసి ,వద్దంటున్నా వినకుండా వెంటబడి మరి లోన్లు బానె ఇచ్చేవారు బ్యాంకు వారు.మరి లోన్లు కి గ్యరెంటియ్యో - తమ పొలాల తో పాటుగా గవర్నమెంటు స్తలాలన్ని ,ఆస్తులన్ని మొహమాటం లేకుండా బలే చూపించే వారు నవాబు గారు.

విషయం తెలిసిన బ్యాంకు మేనేజర్ పోలిస్ కంప్లైంటు ఇస్తే తన వుద్యోగానికే ముప్పని,ఏమి చెయ్యాలో తోచక చివరకు ఊరి పెద్ద బుచ్చి రెడ్డి ని ఆశ్రయించడంతో నవాబు గారిని పిలవ నంపారు.

బుచ్చి రెడ్డి: ఏంటయ్యా ఇది,ఊరిలో పెద్ద మనిషివి నీకు ఇది ఏమన్నా బావుందా

బలే నవాబు: ఆప్ కో కౌన్ బోలా మై పెద మనిషి బోల్కే

బుచ్చి రెడ్డి: అయినా అన్ని ఆస్తులుండీ అప్పు ఎందుకు చేశావ్ అయ్యా
బలే నవాబు: ఆస్తులు క్య మీ?,ఆప్కే పాస్ పూర గలత్ ఇంఫర్మేషన్ వుందీ

వూరి పెద్ద కల్లజోడు కోసం వెతుకు తూండ గానే విషయం అర్దమయిన నవాబు ఒక బలే ఐడియా వచ్చింది.వెంటనే అక్కడ నుంచి మాయం అయ్యాడు.
 బుచ్చి రెడ్డి అనుచరులు నవాబు కోసం వెతగగా , ఆకరుగా నవాబుని పెట్రొల్ బంకు దగ్గర చూసారని ,ఇంటికి కూడ రాలేదని తెలుసుకున్నారు.పరువు పోతుందని ఊరు వదిలి వెల్లిపొయాడెమో అని వూరుకున్నారు.

మరుసటి రోజు షాక్కు గురయిన బ్యాంకు మెనేజర్ ఉరుక్కుంటూ వచ్చి తడబడుతూ చెప్తే కాని ఊరి పెద్దకు తెలియలేదు బారి అగ్ని ప్రమాదం లో బ్యాంకు పూర్తిగా తగలబడిపోయిందని.ఒక్క కాగితం ముక్క కూడా మిగల లేదన్న వార్త విని తెల్లబొయ్యాడు బుచ్చి రెడ్డి.

నవాబు సహెబా మజాకా...పెత్రొల్ - కాస్త కారుకి మిగతా బ్యాంకుకి.

నవాబు గారి కోట సంగతి అంతారా ఒకటి కాదు రెండు కాదు ఆరు ఇన్సూరన్స్ కంపెనీలలో ప్రీమియం కట్టి వున్నారు బలే నవాబు .నవాబు గారి పున్యమంటూ బ్యంకును పునర్ నిర్మించి పేపర్ల బదులు కంపుటర్లు ఎర్పాటు చేసింది ప్రభుత్వం.

ఇలా నవాబు గారి ఐడియాలు చలా మంది జీవితాల్ని మార్చేసాయి.