Thursday, October 14, 2010

సింహపురి కధలు:టౌన్ బస్


తన బ్యాగు టిపాయి పై పెట్టి చెల్లెలి బ్యాగు మంచం పై విసిరేసి, అమ్మ ఉప్మా కావాలి అన్నాడు అనిల్(7త్ క్లాస్).సొఫా లో కూర్చున్న సునీత మెడ చుట్టు చేతులు వేస్తూ అమ్మ నాకు మ్యాగి అంది అమిష(4త్ క్లాస్).మి సంగతి తెలిసే సేమియా ఉప్మా చేసాను .త్వరగా రేడి అయ్యి  తిని బయలు దేరండి ,అమమ్మ ఎదురు చూస్తుంటుంది.నాన్న గారు రావడానికి లేటు అవుతుందంట , మిరు రిక్షా పట్టుకొని వెళ్లాలి అంటూ మసాలా డబ్బా లోంచి పది రూపాయలు
తీసి అనిల్ కి ఇచ్చింది సునీత.

పవర్ కోసం ప్రతిపక్షం ఎదురు చూసి నట్టు ఈ రోజు కోసమే అనిల్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తునాడు. ఎప్పుడూ నాన్న గారి మొటారు సైకిల్ లెదా రిక్షాలో వెళ్లే అనిల్ కి టౌన్ బస్ లో వెళ్లాలనే కోరిక.దీనికి కారణం అనీల్ స్నేహితుడు సలీం - టౌన్ బస్సు లో ఐతే చవకగా ,త్వరగా వెల్లిపోవొచ్చు అని వాడు ఎప్పుడూ అంటుంటాడు.రిక్షా ఐతే ఏడు నుంచి తొమ్మిది రూపాయలు,అదే టౌన్ బస్ అయితే రెండు రూపయలే , మిగతా ఎనిమిది రూపయలతో చాక్లేట్లు కొనుక్కోవచ్చని అమీషాని అమ్మకి చెప్పొదంటూ వప్పించాడు.




అర కిలోమీటరు నడచి రిక్షా స్టాండు దాటి కే.వి.ఆర్ పెట్రొల్ బంకు బస్ స్టాప్ చేరుకున్నారు.ముందర బ్యానెట్టుకి వో పూల దండ ,అద్దాల పైన కమ్మికి వేలాడుతున్న వో చిన్న విమానం తో ఆకు పచ్చ రంగు టౌన్ బస్ వచ్చి ఆగింది.గాలికి తిరుగుతోన్న ఆ విమానపు ఫ్యాను ని చూస్తూ బస్సెక్కుతుంటే చెనక్కాయ తొక్కులు ,సిగెరెట్టు ముక్కలు ఆహ్వానం పలికాయి.కాలీ సీటు కోసం వెతుకుతూ ముందరికి వెళ్లి కుడి వైపు డ్రైవర్ వెనుక మూడో సీట్లో కూర్చున్నారు.చిల్లరగా మారిపోబోతున్న పది రూపాయల కాగితాన్ని దిగాలుగా చూస్తూ , గాంధీ బొమ్మ కి రెండు టికెట్లు అంటూ కండెక్టరుకి ఇచ్చాడు.కమ్మికి ఆనుకొని రెండు పసుపు రంగు టికెట్లు కొట్టి యడం బుజానికి తగిలించుకున్న బ్యాగు విదిలించాడు కండెక్టర్.చిల్లర లేక పోవడంతో టిక్కెట్ల వెనక 8 రు అని రాసి దిగేతప్పుడు తీసుకో అని అనిల్ చేతిలో పెట్టడు .అనిల్ అతని వైపు కోపంగా చూస్తూండగానే కస్తూరి దేవి స్కూల్ అంటూ విజిల్ వేశాడు.

చక చకా ముందరి నుంచి ముగ్గురు అమ్మాయిలు,వెనక నుంచి ఇద్దరు అబ్బాయిలు ఎక్కారు.వాల్లలో వో అమ్మాయి అనిల్ వైపు చూసి కిటికీ వైపు చూసింది.కిటికీ పైన ఎర్రటి అక్షరాలలో రాసివున్న పదాన్ని "స్త్రీలు" అని చదివాడు అనిల్ .వెంటనే లేచి వెనక్కి వెల్లి నిలుచున్నాడు.అంతా సలీం చెప్పినట్టే టౌన్ బస్ కిటికీ లోంచి సింహపురి కొత్తగా ,ఇంకా అందంగా కనిసిపిస్తోంది.నాన్న గారి బైక్ లా కాకుండా చెవ్వులు అదిరే బస్సు హారన్ కి స్కూటర్లు,రిక్షాలు,కార్లు,లారిలు పక్కకి జరిగిపోవడం అనిల్ ,అమిషాలకి తమాషాగ అనిపించింది. బస్సు బయలుదేరి నప్పటి నుంచి ఆ ఇద్దరి అబ్బాయిలలో ఒకరు ముగ్గురి అమ్మాయిలలో ఒకరిని కళ్ళార్పకుండా చూస్తూనే వుండడం అనిల్ గమనించాడు. ఆర్.టి.సీ బస్ స్టాండ్ అని విజిల్ వినిపించగనే ఆ అమ్మయి కూడ అబ్బాయి వైపు చూసి వో చిరునవ్వు నవ్వింది.

సింహపురికి ఇది ప్రధాన బస్టాండు .వచ్చి వెళ్లే బస్సులతో, ప్రయానికులతో ఎప్పుడూ కిట కిట లాడుతుంటుంది.టౌన్ బస్ లన్నింటికీ ఇదే ఎక్కువ టిక్కెట్లు కొట్టే స్టాపు కూడ.డ్రైవర్ ,కండెక్టరు టీ తాగడానికి దిగగానే చెనక్కాయలు,జామ కాయలు ,నీళ్ళ ప్యకెట్లు అంటూ లోపలకి వచ్చారు.బస్సు దిగే ముందు కండెక్టరు దగ్గర చిల్లర తీసుకోవాలి అని గుర్తు చేసుకున్నాడు అనిల్.బస్సు బయలు దేరగానే రోడ్డుపై అరటి పండ్లు ,యాపిల్ పండ్లు,దానిమ్మ ఇలా రక రకాల పండ్ల బండులు ,బేరాలాడుతున్న జనాలు.






మద్రాసు బస్టాండు దగ్గర బయలు దేరే సరికి ,ఇంకొకరు ఎక్కితే డ్రైవరో కండెక్టరో దిగి పొవల్లంతగా నిండి పోయింది బస్సు.వో మూల ఇరుక్కొని వున్న అనిల్ కి దూరం గా ఆకాశాన్ని అంటుతున్న టెలిఫోన్ టవర్ కనిపించింది.ఐఫిల్ టవర్ తర్వాత ఇదే పెద్ద టవర్ అని స్కూల్లో అనుకుంటుంటారు.బస్టాండు లోపల మురళి క్రిష్నా హోటల్ ,పక్కనే పూలు ,పండ్ల దుకానాలు.ఆ పూల పరిమళాన్నిఆస్వాదిస్తుండగానే అది వెనక సీట్ల నుంచి వచ్చే బీడి కంపుగా, వి.అర్ కలేజి స్టాపు చేరే సరికి ఆంజనేయ స్వామి గుడిలోంచి వచ్చె సాంబ్రని సుగందం గా మారింది.బస్సు దిగే ముందు కండెక్టరు దగ్గర చిల్లర తీసుకోవాలి అని మరో సారి గుర్తు చేసుకున్నాడు అనిల్.

వరుస దుకానాలతో రద్దీగా వున్న సండే మార్కెట్ చూస్తూనే , 7త్ పబ్లిక్ పరీక్షలు ఫర్స్ట్ క్లాస్ లో పాస్ అయితే విడియో గేం కొనిస్తానన్న నాన్నగారి మాటలు గుర్తుకొచ్చాయి.వెంటనే ఊహా లోకం లోకి జారుకొని రకరకాల గేంస్ ఆడడంలో మునిగి పొయాడు.గాంధీ బొమ్మ అని విజిల్, ఆ తరువాత రైట్ రైట్ అని విజిల్ వేశాక గాని అనిల్ కళలు చెదర లేదు.వెంటనే జనాలలోంచి అమిషా అంటూ అరుస్తూ ముందరికి దూసుకెల్లాడు.అమిషా అక్కడ లేదు.భయం తో కంగారుగా డ్రైవర్ దగ్గరకు వెల్లి అమిషా అని గట్టిగా అరువగానే బస్సు ఆగింది.బస్సు లోంచి దూకి కిటికీల వైపు చూస్తూ అమిష అమిషా అని అరుస్తూంటే వెనక నుంచి అన్నయ అనే పిలుపు వినబడింది.బస్సు కదిలింది.అనిల్ తేరుకుని చిల్లర అని అరిచే సరికీ బస్సు చాల దూరం వెల్లిపోయింది.


అమిషా చెయ్యి పట్టుకొని , సలీం నుంచి మొదలెట్టి టౌన్ బస్ కండెక్టర్, డ్రైవర్ల వరకూ తిట్టుకుంటూ అరకిలోమీటరు నడవగానే విజయ్ మహల్ రైల్వే గేటు వేసి వుంది.ఆ గేటు ఎందుకు వేస్తారో అనిల్కు అర్దం అయ్యేది కాదు.రైలు కూత వినపడుతున్నా రిక్షాలు,సైకిల్లు,స్కూటర్లూ ఇలా ఇవతల గేటు దగ్గర వంగడం అవతల వైపు లెయ్యడం.వాటితో పాటు గేటు దాటేశారు.


మెట్లు ఎక్కుతున్న అనిల్,అమిషాలకు ఆనందంతో నెండిన అమమ్మ పిలుపు వినిపించింది.ఎప్పుడు తిన్నారో ఎంటో శాంతి బేకరీకి వెళ్లి ఏమన్నా కొనుకొచ్చుకోండి అంటూ అనిల్ చేతిలో పది రూపాయలు పెట్టింది అమమ్మ.అమిషా కోపంగా తన వైపు చూడగానే అనిల్ తల దించుకున్నాడు.


నాని