Friday, July 3, 2009

తాతయ్య:-They say that i have his ego,his anger and his passion..:)వాకిటికి ఎదురుగ్గా ఎర్రపంచకి ముందు నార కుర్చి పైన ఊగుతూ ఈనాడు పత్రిక నెల్లూరు ఎడిషన్ లో మూడో పేజీకి తిప్పుతూ,సుప్రభాతం పలుకుతూన్న రేడియోని పక్కనే వున్న స్టూలు పైన పెట్టి , కాఫి కప్పు అందుకున్నారు తాతయ్య.

మేడ మీద బయట పరుపులు వేసుకోని చల్లగాలిలో ఇ నాలుగు దిక్కులతో మాకు పని లేదు అన్నట్టుగా ఆకాశం లోని నక్షత్రాల వైపు చూస్తూ పనుకున్న మాకు(నాకు,తమ్ముడికి,స్నేహితులకి) వేకువపాదున తాతయ్య గారి రేడిఒ లో వచ్చే సుప్రభాతమే శుభోదయం పలికేది.పొదున్నే ఆరు గంటలకి మొదలయ్యేది తాతయ్య గారి దినచర్య.
స్నానం చేసిన వెంటనే వో పది నిమిషాలు పూజ ,రోజు మొత్తం లో ఆ పది నిమిషాలు మటుకు భ్రిందావనం లో ఓ భవనం లా ఇల్లు నిశబ్దంగా వుంటుంది.దేవుడింటి తలుపు - అదెమో అయిదు అడుగులు , తాతయ్యో ఆరు అడుగులకి ఏమాత్రం తగ్గరు.ఎవరి తాత మరి:).సో పూజ గదిలోకి వెల్లే ప్రతి సారి తలతో పాటు వల్లు వంచి వెల్లడం అలువాటు చేసుకోవాలి. వో అడుకు ఎత్తు పెంచ కూడదు? అని తాతయ్యని ఎవరయిన ప్రస్నిస్తే.కూడదు అనే అయన బదులిస్తారు.రోజంతా అందరి ముందూ హుందాగా , గర్వంతో ,మొండిగా తల ఎత్తుకుని తిరిగే ఎవరైనా సరే దెవుడి గదిలోకి మటుకు అవన్నీ వదిలేసి తల దించుకొని వెల్లాలని ఆయన చెప్పేవారు.

బాగా గంజి పెట్టించి ఇస్త్రీ చేసిన తెల్లటి కద్దర్ చొక్కా,దానికి ఏమాత్రం తీసిపోకుండా పచ్చ అంచులో బంగారపు రంగు కలిపినట్టు పంచ , మంచ్చం పైన పెట్టి నాష్టా తయారీలో మునిగి పోయారు నానమ్మ.తాతయ్య కరెట్టుగా వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చొనే సమయానికి,బయట మెట్ల పక్కనే వేసి వున్న బల్ల నుంచీ బయట అరుగు వరకు జనాలతో నెండి పోయేది .తాతయ్యకి నానమ్మ వడ్డిస్తూంటే వాల్లందరికీ పనివాల్లు వడ్డించే వాల్లు.

పనబ్బాయ్ తెచ్చిన చెప్పులు వేసుకొగానే ,నానమ్మ కండువతో ఎదురొచ్చేది.కండువ యెడమ బుజంపై వేసుకోని చేతిలో నల్ల గొడుగు పట్టుకోని వెంట వచే జనం తో వూరిలో నడుస్తూంటే ,నడిచే ప్రతి వీదికి అయనిలోని హుందా తనం వచ్చినట్లు అగుపించేది.ఆ హుందా తనం ,గర్వం ఊరి సర్పంచ్ అనో ,డబ్బు ,బలగం వుందనో వచ్చినవి కావు.బ్రతికినన్ని రోజులు పదిమందికి పనికొచ్చే , నలుగురిని బాగుపరిచే పనులు చేయాల్లన్న ఆయనిలోని పట్టుదల తెచ్చిపెట్టిన బహుమతులే అవి.

రోజంతా వూరిలో వాల్లందరి సమస్యలు పరీష్కరిచే తాతయ్యకి మేము కాల్ల వేల్లు లాగితే గాని నిద్ర పట్టేది కాదు.రోజు మొత్తంలో మేము చేసే ఒకే ఒక్క పని కొచ్చే పని కాబట్టి ఎంతో బాద్యతగా ఫీల్ అయ్యిపొతూ ఒకటికి మూడు సార్లు లాగేసే వాల్లం వేల్లు ఇక కటక్ అననంతవరకు.ఇలా ఆయన నిద్రలోకి జారుకోగానే మేము చందమామని పలకరిస్తూ మేడ ఎక్కేసే వాల్లం.....

నాని