లొకేషన్:- ఫిల్లీ స్కీ రిసార్ట్
సమయం:-టీం ఫిల్లీ స్కీయింగ్కి బయలుదేరిన సమయం.మౌంట్ ఎవరెస్టు ఎక్కాలనుకున్న నాని మంచు కొండ ఎక్కిన వేల...
ఓ అరగంట డ్రైవ్ చేస్తే వచ్చేసింది ఫిల్లీ స్కీ రిసార్ట్.కారులోంచి దిగగానే కాస్త దూరంలో మా వింజమూరి తిర్నాళ్ళలా వుంది కోలాహలం.చిన్నపుడు జగదేక వీరుడు అతిలోక సుందరీ సినిమాలో చూసిన కొండలంటి మంచు కొండ.కొండకి ఒక వైపు తీగలకి వేలడుతూ పైకీ కిందకి తిరుగుతున్న కుర్చీలలా కనిపించాయి.మరో వైపు ఇంకో చిన్న కొండ వుంది.దాని పైన చిన్న పిల్లలు ట్యుబులలో జారుతూ,కొందరయితే దొల్లుకుంటూ కిందకి వచ్చేస్తున్నారు:)
మద్యలో ఆగాలంటే మన కాల్లు రెండు ఒకే వైపుకి తిప్పుతూ ,స్కీలు రెండూ ముందర వైపు ఒకదానికొకటి తాకేలా ఓ త్రికోనంలా వుంచాలని,కుడి వైపుకి తిరగాలంటే కుడి కాలుని కుడి వైపుకి తిప్పాలి అలాగే యడమ వైపుకి కూడ అని చెప్తూ మమ్మల్ని తాడులతో కదిలే చేయిర్ లిఫ్టు ఎక్కిచేసాడు ఇన్స్ట్రక్టర్.
కొండ పైకి వచ్చేసాము అనగానే జేంస్ బాండు సినెమాలో హెలికాఫ్టర్లోంచీ దూకి నట్టూ దూకమన్నారు మమ్మల్ని.భయం భయంగా దూకేశాం .ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ,మనం పడినా ఫర్లేదు మిగతా వాల్ల పైన పదకూడదు,పడేయకూడదు అని అనుకుంటూ జై చిరంజీవా,జగదేక వీరా అంటూ:) మొదలెట్టాము మా స్కీయింగ్.చల్ల గలిలో అలా దూసుకొని కిందకి వెల్తుంటే, ఇందాక దాటి వచ్చామే సరస్సు అదే కనిపిస్తోంది ఎదురుగ్గా.కాల్లు హ్యండ్ ఇచ్చి త్రికోనం ఆకరం తీసుకొకపొతే స్కీలు ఆగక ,వెల్లి దంట్లో ఎక్కడ పడిపొతమో అనే భయంతో మాకు మెమే ముందే పడిపొయాం మొదటి రెండు ట్రిప్లలో:).దారి పొడవునా అక్కడక్కాడ గార్డ్లు నిలుచోని వున్నారు.పడకుండా ఆపటానికి కాదు ,పడిన వారిని లేపటాకిని:).మొదటి నాలుగు సార్లు పడుతూ లేస్తూ మెల్లి మెల్లిగా లిఫ్టు ఎక్కుతూ కస్ట పడినా ,అయిదో రౌండు కల్లా లిఫ్టుతో పోటి పడడం ఆరంబించాము:)...
ఒకరితో ఒకరు పోటి పడే లెవల్కి చేరుకోని బాండులా స్టైలుగా స్కీ చెయ్యడం మొదలెట్టాము.చిన్నపిల్లలు బోర్డు స్కీ అంటే ఒక్కటే పెద్ద సైజు స్కీ చేస్తూ వుంటే,మేము వచ్చేసారి చేస్తాములేరా అనుకుంటూ సమయం తెలియనంతగా మునిగిపోయి వేసేశాము రౌండ్ల పై రౌండ్లు...
చీకటి పడ్డాక ఫ్లడ్ లైట్లలలో కూడా కాసేపు స్కీ చేసేశాక ఇంటికి వెల్లాలని అనిపించక పోయినా ,మల్లీ రావలి అంటే ఇప్పుడు వెల్లాలి కదా అనుకుంటూ బయలుదేరాం ఇంటికి:).మరవలేని అనుభూతి,మరపు రాని అయ్యొ-డెక్స్ నెప్పులతో గూటికి చేరుకున్నాము:)
Related Articles
Florida Part 2:Miami The Paradise
UK Visitor Visa for non US Citizens in USA
Hasinis Day Out
Florida Part 1:Six days in Orlando
Texas:Take 8
F.E.A.R:-Forget Everything And Ride!!
Niagara Falls With West Coast Gang
Little Rock ,Arkansas
Wild Wild West 2
Dance in Delaware
Austin Texas
Kerala
Wild Wild West 1
Denver The Mile High City
Ocean City