Sunday, October 12, 2008

ఆన్-సైట్ కేరలా:-Gods Own Country
లొకేషన్:-కొట్టాయం కేరలా
సమయం:-ఆన్-సైట్ కలలు నిజమైన వేల:)

హాలివుడ్ సెలెబ్రిటీలు అంత కర్చు పెట్టి ఐలాండ్లు కొనుకుంటూంటే మాకు మటుకు ఎక్కడ బోటు ఆగినా అది వో చిన్ని
ఐలాండే.అలా అలల తో మా టైని-టానిక్ పైన పయనిస్తూ తెలుసుకున్న విషయం ఎంటంటే,'కేరలా'
'కెరా అంటే కొబ్బరిబొండం/టెంకాయ ,'అలం' అంటే ప్రదేశం

సుందరమయిన "Gods own country" లో
తల పైకెత్తితే టెంకాయ/కెర చెట్లే....


అసలు నానిగాడు ఇక్కడకి ఎలా చెరాడంటే...

ఫ్లాష్ బ్యాక్ @@@@@@

అది వో వర్షం కురవని సన్ని సన్ని డే.ఆన్-సైట్
అంటే ఆమడ దూరంలో వుండే మా మేనేజెర్ ...

ఏమొయ్ నాని MM ఆన్-సైట్ చాన్స్ వుంది వెల్తావ్ ఎంటి అంటే ,నా దిమ్మ తిరిగి టికెట్ బ్లాక్ అయింది...

MM అంటే అమెరికా చాక్లేట్ల కంపెనీ కాదని,చిన్నపుడు చదివిన మలయాళం మనోరమా పుస్తకాలు /కేరెలాలో అతి పెద్ద
దైన దిన పత్రిక అని ఫ్లైటు ఎక్కేముందు గాని తెలియలెదు.

సో చికాగోగురించీ కలలు కంటూన్న నెను మొత్తానికి కొచ్చిన్ చేరుకున్నాను ఇలా.


ఆన్-సైట్ అమెరికా ఐతే వెనక్కి పంపేస్తారని పనిచేసివుండే వాడినెమో:).ఇక్కడ ఎక్కడికి పంపిచేది .ఎక్కువ చేస్తే
సెలవలు పెట్టి మరీ తిరుగుతా అని చెప్పి ,రెండు నెలలలో ,నాని 'కెరలా లోకల్ 'లా తయారయ్యా.రక రకాల కొత్త వంటకాలు ట్రై చేస్తూ... 'చిల్లి ఫిష్','బనానా చిప్స్ ' నా ఫ్యావరేటుగా ఫిక్స్ అయ్యిపోయాను.మొదట్లో కొబ్బరినూనెతో తయారు చెసినా , త్వరగానే మన ఇ-స్టయిల్కి ట్యును అయ్యిపోయాడు హొటెల్వాడు.

ఇప్పుడు ఫ్లాష్ బాక్ నుంచి
బాక్ వెల్తే@@@@ఏ ఐలాండు లోఆపినా,అప్పుడే పట్టిన చాపలు,రొయ్యలు సెలెక్టు చేసెసుకోని మరీ వండించుకోవచ్చు..అల బోట్లో వెల్తూ
తెలుసుకున్న విసెషాలు ఇవి...


కెరెలా literacy rate is almost 100% అని తెలిసిన నాకు,దాని వల్ల నా మిత్రులు పడే కష్టాలు నా మనసుని
కదిలించేసాయి.ఇక్కడ సాఫ్ట్ వేరు ఇంజినీరుకి హార్డుగా నెలకి వో ఎనిమిది వేలు ముడుతుంది.ఇంక డిగ్రిలు చేసి ,కాలిగా వుండే వాల్లు ఎందరో....

అందుకే నిరుద్యొగంతో పాటు ఇక్కడ సుఇసైడ్ల సంఖ్య కూడ ఎక్కువ అవ్వటం దురద్రుష్టకరమయిన విషయం...


ఒకప్పుడు కేరలకి తమిలనాడుకి ఒక్కటే బాష వుండెదంట.అందుకే కాబొలు ఇప్పటికి కెరల వాసులు తమిల సినెమాలు
తెగ చూస్తారు.


'చటా' అంటే మళయాళంలో 'అన్నా అని కూడ తెలుసుకున్నను:)


అప్పట్లొ మనకి అమెరికాలో ఎముందో తెలిదు కాని,ఇంతకంటే సుందరమైన ప్రదేశం ప్రపంచ్చంలో ఎక్కడా వుండదని
ఫిక్స్ అయ్యిపొయ్యా...
ఇక్కడ వొక్క,కాఫీతో పాటు రబ్బర్ ఎంత ఎక్కువ దొరుకుతుందో రబ్బరుతో వేసిన రోడ్లు చూస్తే తెలుస్తుంది....

ఇలాంటి విషయాలు తెలుసుకుంటూనే అందమైన ఎన్నో ప్రదేసాలు తిరిగేశాము.వైకొం టెంపుల్ (లక్ష దీపల
దెవాలయం),కొట్టాయం బ్యాక్వాటర్స్.


ఇన్ని కొత్త ప్రదేశాలు తిరిగినా ఒక్కసారి కూడా నా పర్సుని బయటకి తీనివ్వని నా మిత్రులకి వీడ్కోలు పలుకుతూ
,బెంగులూరుకి రండి మీ పని చెప్తా అని చెప్తూ జెట్ యయిర్వేస్ వారి విమానం ఎక్కేశాను....

This part of my blog is dedicated to my mallu friends:).reji,praveen,rajesh,joseph.pavan....


Related Articles


Florida Part 2:Miami The Paradise


UK Visitor Visa for non US Citizens in USA


Hasinis Day Out


Florida Part 1:Six days in Orlando

Texas:Take 8


F.E.A.R:-Forget Everything And Ride!!


Niagara Falls With West Coast Gang


Little Rock ,Arkansas


Wild Wild West 2


Dance in Delaware


Austin Texas


First Ski


Wild Wild West 1


Denver The Mile High City


Ocean City