Monday, October 6, 2008

మా పెళ్ళి పుస్తకం @ ప్రైమావెరా...పొదున్ లెగ్గాలీ,స్నానం చెయ్యాలీ
కారులో ఎక్కాలీ,ఆఫ్ఫిస్ కెల్లాలీ
బాత్-రూం లొ పాటలు, బ్రేక్-ఫాస్ట్ లో మాటలు
పిల్ల ముందు వొండర్లు,మేనేజర్ ముందు బ్లండ్డర్లు

ఇక ట్రైనింగులకి వెయిటింగు, మీటింగులో ఫైటింగు
కేఫెటేరియలొ డేటింగూ ఊ ఊ ఊ ఊ ఊఊ

నేను మన చైనా నుంచీ వచ్చిన మేయ్(అది పేరు) తో అనింది అల్లా ,మీరందరు అనుకుంటున్నట్టూ ఆ టెస్టింగ్ టీంలో
అమ్మాయికి నాకు యే సంభందం లేదు అండి అని అంతే:)....

ఆఫిస్ మొత్తం తెలిసిపోయింది విషయం.కాని ఆ పెళ్ళి పుస్తకం సినిమాలోలా,ఈ తీయ్యని నిజాన్ని అందరికి
తెలియకుండా ఎక్కువ రోజులు దాచక పోయినా,దాచినన్ని రోజులు బలే ఎంజాయ్ చశాము లే....


తెలియక ముందు ప్రశ్నలు మీ ఊహా ప్రపంచానికి వదిలేస్తూ ...తెలిసిన తరవత అడిగినవి ఇవి..మీరిద్దరూ ఒకే కారులో వస్తరా?

అబ్బా సూపర్ గ్యాసు/petrol సేవింగ్ కదా...

హేహ్ అది నీ ఇంటర్నెట్ కేబుల్ కాదు మీ ఆయనది...

ఎంటీ మీ ఆయన రాసిన కోడ్లో బగ్గులే లెవంట.ఇందులో నీ హస్తం వుందా..?కుకింగ్ కాంపటీషనుకి తెచ్చేవి నువ్వు చేస్తవా మీ అయాన చెస్తాడా?

hmmm వాల్ల ప్రశ్నలకి అంతం లేదు ,మా ప్రాజెట్టుకి డెడ్-లైన్ లేదు అనుకోండి:).

మా పెళ్ళి పుస్తకంలో వో మరపురాని మరచిపోలెని మొదటి చాప్టరు ఇంతటితో ముగిస్తున్నాను