Wednesday, August 3, 2011

సింహపురి కధలు:అమ్మ ప్రేమ


 మల్లి పూలు,మామిడి  పండ్లు అమ్మేవారు,పోలీసుల నుంచి ముస్టి వాల్ల వరకు అందరూ అక్కడికే చేరుకున్నారు.మద్రాసు బస్టాండు ఆనుకొని వున్న ఎత్తయిన టెలిఫోను టవరు పక్కనే ఎక్జిబిషన్ గ్రౌండులో ఏటా వో సారి ఏర్పాటు చేసే ఎక్జిబిషన్ చుట్టూ పక్కల వూర్ల అన్నింటి నుంచీ వచ్చిన జనాలతో హడా విడిగా వుంది.పల్లెటూర్ల  నుంచి వచ్చిన వారికి అది వో తిర్నాల లాగే.

అలా యల్లాయపాళెం నుంచి వచ్చిన వారిలో అమాయకంగా కనిపించే ఆ ఇద్దరు రమ ,శాంతి.బర్తల్ని ఫస్టు షో సినిమాకి పంపేసి, ఇద్దరూ ఇద్దరు పిల్లలని వేసుకొని అరగంట బస్సు ప్రయానం తో అక్కడికి సాయంత్రం ఏడు గంటలకి చేరుకున్నారు.

ఎంట్రీ టికెట్టు కొని రాక్షస బల్లి నొరులా చెక్కలతో కట్టి వున్న ద్వారం లోంచి లొపలకి వెల్లారు.రక రకాల వంటకాల గుబాలింపులు ఆహ్వానం పలికాయి.చుట్టూ బొమ్మలు,సామాన్ల దుకానాలు.వాటి మద్యలో రక రకాల తిను బండారాలమ్మే దుకానాలు.
వంటింటి సామన్లమ్మే దుకానం లో కోసి పడేసిన కూరగాయలు కుల్లిన కంపు.

శాంతికి భయం భయం అంటున్నా రమ బలవంతంగా జైంటు వీలు ఎక్కించడంతో రంగుల రాట్రం ఆగినా శాంతి తల తిరగడం ఆగటానికి ముప్పవు గంట పట్టింది.

పెద్ద అప్పడం ,పావుబాజీ ,మిరపకాయ బజ్జీలు ఆస్వాదిస్తూ ,ఒకే బంతితో ఒక దాని పై ఒకటి పెట్టి వున్న గ్లాసులని కొట్టేయడంతో రమకు గోడ గడియారం బహూకరించారు.

పిల్లలు తుపాకీలు బుడగలకు గురిపెడుతోంటే వాల్లు ఇద్దరు వంట,ఇంటి సామాన్లు కొనడంలో మునిగి పొయ్యారు.తేరుకొని వాచీ చూసే సరికి ఎనిమిదీ ముక్కాలు అయ్యింది.ఆకరి బస్సుకి టైము అయ్యిందని హడావిడిగా బస్ స్టాపుకు చేరారు.అక్కడ నిలొచొని వున్న వాల్ల  వూరి వాల్లను పలకరిస్తూ ఆకరి బస్సు వచ్చిందా అని అడిగారు.వాల్లూ దానికోసమే  ఎదురు చూస్తున్నారు  అనడంతో , కొన్న వస్తువులు , గెలిచిన గడియారం ఒక్కోటి తీసి చూసుకొంటూ మురసిపొయ్యారు.ఈ లోగా వో పచ్చ రంగు టౌన్ బస్సు చెవ్వులు అదిరేలా హారన్ మోగిస్తూ  వచ్చి ఆగింది.వాల్ల వూరి వల్లందరు ఎక్కడం చూసి  పిల్లలను తీసుకొని ఎక్కేసారు.

బస్సు కదలగానే టికెట్లు కొట్టబోతున్న కండెక్టరు , అయ్యొ ఇది యల్లాయపాళెం వెల్లదమ్మా , ఆత్మకూరు బస్టాండే లాస్టు స్టాపు అనడం తో అందరు కంగారుగా లేచి గబ గబా దిగేసారు.బస్సు వెల్లిపోయింది.ఇద్దరూ మల్లీ వస్తు పరిసీలనా కార్యక్రమం లో మునిగి పోయారు.రెండు నిమిషాల తర్వాత ఉన్నటుండి శాంతి రమతో: మీ చిన్న వాడు ఎడే? అంది.

అంతే అప్పటి వరకూ తుఫాను ముందు నిర్మానుష్యమైన నిశబ్ధం లా వున్న వాతావరనం ఆ ప్రశ్నతో సునామిలా మారింది.రమ చూపులు మారిపొయాయ్.అటు ఇటు చూసింది.బస్టాప్ లో అందరినీ, మా అబ్బయి ఏడి ఏడి అని అడిగింది.వంటి మీద బట్ట వుందో లేదొ అని కూడ చూసుకోకుండా బస్టాపు లోంచి పరిగెట్టి కాస్త దూరం వెల్లి కుప్ప కూలింది .శాంతి , పరుగు పరుగున అక్కడకి చేరే లోపు అలాగే నేల పై పడి గుండెలు బాదు కొంటూ బాబు బాబు అని ఏడుస్తూ , శాంతి పట్టుకోను ప్రయత్నిస్తున్నా ఆగలేదు.బస్సు వెల్లి అయిదు నిమిషల్లు అయిందే ఎక్కడికి వెల్తావ్ అన్న శాంతి మాటలు వినే స్తితి లో తను లేదు?

మామిడి కాయలు బేర మాడుతున్న వొకతను ఇదంతా గమనించి ,విషయం తెలుసుకొని ఆ అబ్బాయిని గుర్తు పట్ట గలిగే మరొకరిని బైకు ఎక్కించుకొని ఆత్మకూరు బస్తాండు వైపు వెల్లాడు.రమకు కూల్ డ్రింకు తాగించే వాల్ల ప్రయత్నాలు విఫలమయ్యాయి.ఏడుపు ఆప లేదు.అంత నావల్లే అంటూ తల కొట్టుకుంది,వస్తువుల పైన వున్న ద్యాస బిడ్డ పైన లేదు అంటూ కుల్లి కుల్లి ఏడ్చింది.

పది నిమిషలలో ఆ అగ్నాత వ్యక్తి పిల్లాడితో తిరిగి వచ్చాడు . ఏడుస్తున్న వాడిని గుండెలకు హత్తుకొని గాని ఏడుపు ఆపలేదు రమ.చిన్నగా లింకా తాగుతూ ఈ ప్రపంచంలోకి వస్తూంటే తగిలిన దెబ్బల తాలూకూ నొప్పులు తెలిసాయి.అయినా ఆ బస్సు ఎక్కడికి వెల్తుందే? పిచ్చిదానిలా ఆ పరుగులేంటీ? ఆ అరుపులేంటీ? ఆ  తల బాదేసుకోవటం ఏమిటీ? అన్న శాంతి ప్రశ్నకు చిరు నవ్వుతో సమాదానమిస్తూ ఆకరి బస్సు ఎక్కేసింది.

బస్సు దూరం వెల్లే కొంది వెనక అద్దంలొంచి తిరుగుతూ కనిపిస్తున్న రంగుల రాట్నం చిన్నదిగా మారిపోతోంది...