Friday, July 15, 2011

సింహపురి కధలు : సుడిగుండం


ఈనాడు ఆదివారపు పుస్తకంలో అంకెలు కలుపుతూ బొమ్మను పూర్తిచేసి పుస్తకం అమ్మకు ఇచ్చానో లేదో ఎదురుగ్గా వెనకింటి వంసీ. హరి,అంజద్ వాల్లు వచ్చి సందు చివర వున్నారని తీసుకు వెల్లాడు.

హరి:

పెన్నా నది లో ఈతకి వెల్తున్నాం.వస్తావా?

నేను:

నేను రాను.నాకు ఈత రాదు.అదీ కాక చూస్తెనే మనసుని ఆనందంతో నింప్పేస్తూ ప్రవహించే పెన్నా నది చాలా లోతు వుంటుందని ,వర్షా కాలంలో ప్రమాదకరమని, పెన్నా బ్యారేజి పై నుంచి మా వూరికి వెల్తున్న ప్రతి సారి తాతయ్య అంటారు.

హరి:

మా తమ్ముడికి కూడ ఈత రాదు.వూరికే దిగి ఆడుకొని వచ్చేయడమే.ఎదన్నా అయితే నేను కిషోర్ వున్నాము కదా.

నేను:

అయినా అక్కడికి బస్సులు ఏవీ వెల్లవు కదా. ఎలా వెల్తారు? నడిచా?

హరి:

నువ్వు చాల విషయాలు తెలుసుకోవాలి.సరే,నువ్వు ఎలాగో రావు.ఎంత త్రిల్లు మిస్స్ అయ్యావో రేపు స్కూల్లో తెలుసుకో.

ఇలా నేను రానని చెప్పటం ఇది మొదటి సారి కాదు, ఇలాంటి పనులు వాల్లకి కొత్తా కాదు.ఇంతకు ముందు ఇలానే సింహపురి చెరువు దగ్గర వేటకని వెల్దాం అని వచ్చారు.పోలీసు గ్రౌండు దాటుతూ అస్తమిస్తున్న ఎర్రటి సూర్యుడి వైపుగా పది నిమిషాలలొ సైకిల్ తొక్కితే ఏటి గట్టు చేరుకుంటాం.అక్కడే సింహపురి దర్గా కూడా వుంటుంది.ఏటా వో సారి ఆగస్టు నెలలో ఇక్కడ రొట్టెల పండుగ కుల మత బేదాలు లేకుండా జరుపుకుంటాము.ఆ రొట్టెల పండుగకు తప్ప ఎప్పుడూ అటు వైపు వెల్లని నేను అమ్మకు భయపడి వేటకి రానన్నాను.

వేట అంటే ఎదో బానాల తొనో తుపాకీలతొనో వూరి పై బడ్డ జంతువులను సమ్హరించడమో,తిమింగలాలు పట్టడమో కాదు.క్యాడ్బాల్ కి రాయి పెట్టి లాగి వదలడమే.తగిలితే కొంగ లేకపొతే రాయి చెరువులో తల కిందులుగా మునకేస్తాయి.అది ఎంత రక్తపాతం తో కూడిందో వో సారి మా పనబ్బాయి మురలీ చెప్తే విని వాడి పై కోపం,అసహ్యం కలిగాయి.అయినా హరి గాడి నాన్న గారు సింహపురి లొనే పెద్ద కాంట్రాక్టరు,వీడికి ఈ రాక్షస బుద్దులు ఏమిటో?

మరుసటి రోజు,స్కూలుకి తయారవుతూ పేపర్ హడావిడిగా తిరగేస్తున్న నేను సింహపురి సంచిక చూస్తూ కాసేపు అలనే వుండి పొయ్యాను.పెన్నా నది పై పెను విషాదం -  ఈతకని వెల్లి ఇద్దరు బాలుర దుర్మరనం.పరుగెట్టి వంసీ వాల్ల ఇంటికి వెల్లాను.వాడు అప్పుడే లేచి పొల్లు తోముతున్నాడు.ఆకరి నిమిషంలో వాల్ల తాత గారు వూరి నుంచి రావడంతో వాడు వెల్లలేదు.ఇద్దరం అంజద్ ఇంటికి పరుగులు తీసాం.కాంట్రాక్టు పనులకు నదిలో ఇసుక తవ్వి దొంగలించడం వల్ల లోతయిన గొయ్యలు ఏర్పడి,వర్షా కాలంలో జోరయిన నీటి ప్రవాహం వల్ల ఆ గొయ్యిలలో సుడిగుండాలు తయారవుతాయి.లోటు లేదు కదా అని అడుగేస్తే, సుడి గుండం లోపలకు లాగేసి అడుగున బురదలో హరి తమ్ముడు మనోజ్ కాలు ఇరుక్కు పోయిందంట.వాడిని కాపాడాలని దూకిన కిషోర్ కూడ ఇరుక్కు పోయాడని తెలిసి ఏడుపు వచ్చింది.హరి ఇంకా పరారీలో వున్నాడని తన గదిలోంచి బయటకు రాని అంజద్ ఏడుస్తూ చెప్పాడు.

అన్నింటికంటే వాల్లు అక్కడకి చేరిన తీరు చదవి నా వల్లు జలదరించింది.చెత్త తీసుకెల్లి పెన్నానది కి అవతల వైపు తగలబెట్టే మునిసిపాలిటీ ట్రాక్టరు వెనకనుంచి పరుగెత్తి ఎక్కి , యమ పాశం మెడకు చుట్టుకున్నట్టు తలుపు,గొళ్ళాలు పట్టుకొని వ్రేలాడుతూ వెల్లారట.

స్కూలుకి ఆరోజు సెలవ ప్రకటించారు.