Wednesday, June 22, 2011

3 ఈడియట్స్ కాదు సాఫ్టువేరు ఇంజినీర్స్ : రాంబాబు ఇంటర్వివ్


పేరుకు ఇస్త్రీ కొట్టే అయినా ఆ ఏరియా లో రాజన్న తెలియని సాఫ్టు వేరు ఇంజినీరు వుండడు.జాబ్ ఇంటర్వివ్ అయినా పెళ్ళి ఇంటర్వివ్ అయినా రాజన్నకు తెలియాల్సిందే.ఆయన కుక్క పేరు ఫేస్ బుక్.వీది కుక్కకి వింత పేరు ఏంటని అడిగితే,ట్రెండుకి తగ్గటే వుండాలి పేర్లు అయినా షేర్లు అయినా అనేవాడు.ఇక మన ముగ్గురు సాఫ్టు వేరు ఇంజినీర్ల విషయానికి వస్తే,ఇంకా అదే చిన్న కంపెనీలో పనిచేస్తూ వారానికి మూడు ఇంటర్వివ్ లు ఆరు పార్టీలతో లాక్కొస్తున్నారు.

రాంబాబు నలబై ఏడో ఇంటర్వివ్ తర్వాత...

రాజన్న: నవ్వుతూ,ఎం రాంబాబు మల్లీ పొయ్యినట్టుంది ఇంటర్వివ్.

రాంబాబు: ఒక ఇంటర్వివ్ అంటే ఎంత పెద్ద విషయమో తెలుసా నీకు?

రాజన్న: ఎముంది ఇస్త్రి బట్టలు తగిలించామ ,ఆటో ఎక్కామా.

బాల: ఇంతకీ ఏమయింది?

రాంబాబు: ఎప్పట్లా కాకుండా ఇసారి నలుగురు - వో లీడు,వో ఆర్కిటెక్టు,మేనేజెరు ,డైరక్టరు ఎదురుగ్గా కూర్చున్నరు.నా రేంజు పెరిగిందేమో అనుకుని, మొదట నా గురించి చెప్పాను .

బాల: అక్కడ దొబ్బుంటుంది

రాంబాబు: లేదు నా పని గురించి అడిగారు.రాం గోపాల్ వర్మ నాగర్జున కి శివా సినిమా న్యారేట్ చేసినట్టు ,బాలయ్యకు విజయేంద్ర వర్మా సినిమా కధ చెప్పినట్టు,జాని సినిమా గురించి పవన్ కల్యాన్ తనలో తనే మాట్లాడుకున్నట్టు ,ఇంతక ముందు ఎప్పుడు కని విని ఎరుగని రీతి లో వివరించాను.

అవినాష్: సాఫ్ట్ వేరు గురించి అడిగితే సినిమా కధలు చెప్పావ.ఇంకేముంది తెర పడీందా.

రాంబాబు: లేదు, వాల్లూ నాకు వో స్పీల్ బర్గ్ సినిమా కధ చెప్పారు.నేను న్యరేటు చేసిన ఫేకు ప్రాజెక్టు వాల్లు అయిదు సంవస్తరాల నుంచి రెక్కలు ముక్కలు చేసుకొని ఇల్లు, పెళ్ళి వదిలేసి మరీ డెవలప్ చేసారంట.ఆ మేనేజర్ కు అయితే ఏడుపు ఒక్కటే తక్కువ.

రాజన్న: తర్వాత?

రాంబాబు: బాలా వైపు కోపంగా చూస్తూ, నాలాంటి ఫేక్ బ్యాచ్ ఇంకా ఎంతమంది వున్నారో, అందరినీ వెంటనే ప్రాజెక్టు తీసేయమన్నారు.భవిషెత్తులో ఇలా రెజుమే కనపడితే పోలీసులకి పట్టిస్తామని మర్యాద పూర్వకంగా చెప్పారు.

అవినాష్: మరి తీసేసావా ప్రాజెక్ట్టు?

రాంబాబు: లేదు మర్చేసా.వాల్లది బ్యాంకుకి అయితే నాది మిలిటరీకి.ఎక్కువ చేస్తే నెనే కేసు పెడతా.ఇదంతా నాకు బాధ అనిపించలేదు కాని వెనకొచ్చి ఆటో దిగి ఆఫిసు లోకి వెలుతుంటే మా సి.ఇ.వో ఎదురొచ్చి పిచ్చ బూతులు తిట్టాడు.

రాజన్న: అయానకి ఎలా తెలిసింది.

రాంబాబు: నేను ఎప్పుడయిన్న ఇలా ఫార్మల్ గా రెడీ అయ్యి మా ఆఫీసుకి వెల్లడం చూసావ?

రాంబాబు: పకన్నే నిలొచొని తొకాడిస్తున్న ఫేస్ బుక్ కి బిస్కెట్టు వేస్తూ,రాజన్న నీకో విషయం తెలుసా,ఈ బెంగులూరు లో గాల్లోకి రాయి వేస్తే అది వో సాఫ్టు వేరు ఇంజినీరు పైనో, కుక్క పైనో పడుతుంది.అంత మంది ఇంజినీర్లు ,ప్రతి వీధికి అన్ని కుక్కలు.