Saturday, October 24, 2009

నా ఊరు :To my village with love...





వీదంతా స్నేహితులే,ఊరంతా బందువులే ,కలసి ఆడిన ఆటలెన్నో...
వేసవి కాలంలో ఈత కధలు ,వాన వస్తే తీపి జ్ఞాపకాలు..
ప్ల్యానిటోరియం అక్కర్లేదు,మేడ ఎక్కితే తారలన్నీ మావే...
భందుత్వాలు తెలుసుకోవటానికి పెళ్ళిలకి వెల్లనక్కర్లేదు ,ఊరంతా వరుసలే..
కోట్ల ఆస్తులు అక్కర్లేదు ప్రతి రేయి హాయిగా నిద్ర పొతే చాలు..

మరో జన్మ అక్కర్లేదు నాకు ఇచ్చిన ఆనందాలన్ని తిరిగి నితో/నా వాల్లతో పంచుకోగలిగితే చాలు...










రోడ్డుకి రెండు వైపుల పచ్చని పొంట పొలాలు ,అక్కడక్కడ రొయ్యల చెరువులు...

బస్సు బుచ్చి రెడ్డి పాళెం లో ఆగగానే కిటికీలకి వున్న కమ్ములని పట్టుకోని ,టైరు పైన కాల్లు పెట్టి ఎక్కేస్తున్నారు జనాలు.సీటు కోసం కర్చీఫ్ వేసే వాల్లు కాదు.అరిటపండ్ల నుంచి జాంకాయలు దాక,సెనగపప్పుల నుంచి ఉప్పుసెనగలవరకు అమ్మేస్తుంటారు వాల్లు..

పొలం గట్టు పైన వరుసగా తాటి చెట్ల మద్యలోంచి దూరంగా అస్తమిస్తున్న సూర్యుడు ,టెలిఫోన్ తీగలపైన కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న గువ్వలు.అంటే మరో అరగంటలో ఊరు చేరుకుంటాం.

చెరువు కట్ట పైన వరుసగా మామిడి చెట్లు .చీకట్లో కనిపించక పోయిన ఎక్కడ ఏ చెట్టు వుందో ఏ పుట్ట వుందో నా మనసుకి తెలుసు,అందుకే అది ఆనందంతో నెండి పోయింది.











బస్సు దిగి ఇంటికి వెల్లే లోపు రక రకాల పలకరింపులు.వాల్లు ఎవరో గుర్తుకు తెచ్చుకొనే లోపే వరుసలు కలిపేసి వడలు కూడా వడ్డిచేస్తారు:)








సూర్యుడికంటే ముందుగా పొద్దునే నాలుగు గంటలకి మస్తానయ్య టీ కొట్టు దగ్గర మొదలవుతుంది రంగన్న దినచర్య.టీ తాగుతూ డిల్లీ రాజకియాల నుంచి రాజధాని ఎక్స్ ప్రెస్లా హైదరాబాదు చేరుకుని ,అక్కడ కాసేపు సూచనలు ఇచ్చి ,చార్మినార్ బీడి తాగుతూ హైదరాబదు ఎక్స్ ప్రెస్ లో మా గల్లి రజకియ్యాలకి చేరుకుంటాడు.

సద్యన్నం మూట గట్టున పెట్టి,ఒక చేతిలో బుట్ట పట్టుకొని ,మరో చేత్తో తమలపాకులు గిల్లుతూ యెంకి పాటలు పాడుకుంటూ హాయిగా సాగిపోతుంది రంగన్న రోజంతా...

సమయం ఏడు గంటలు BST(Buffalo/బర్రెల Standard Time).పాతూరు నుంచి మొదలయ్యి గడ్డి సత్యాగ్రహానికి బయలు దేరినట్లు తండొప తండాలుగా , వున్న సింగిల్ లైన్(2 వే) రోడ్డుతో పాటు ఫుట్ పాత్ని సైతం లెక్క చెయ్యకుండా వస్తున్నాయి బర్రెలు.ఏ వీదికి ఆ వీదికి బ్యాచ్లు బ్యాచ్లు గా వచ్చి కలసిపోతుంటాయి బర్రెలు.

ఆ సమయంలో బస్సు అయినా కారు అయినా ఊరిలోకి వెల్లాలంటే "Please Expect Delays":)..



వాన వస్తే కాగితలే పడవలాయే...

వర్షంకంటే ముందు నాకెంతో ఇష్టమయిన మట్టి వాసన వస్తుంది.అది మేడ మీద ఆరేసివున్న బట్టలు వెంటనే తీసుకురావాలని పెంచలమ్మకి ఓ సిగ్నల్. పచ్చని పొలాలు,దూరంగా నల్లని కొండలు,మనసును కమ్మేస్తూ నల్లని మబ్బులు ,ఆ ద్రుశ్యాన్ని చూస్తూ అలా వర్షంలో తడచిపోతూ వుండిపోవాలనిపించేది.తొలి చినుకు నుదిటిని తాకగానే పుస్తకంలో మొదటి పేజీ చిరిగిపొయేది.పడవలు తో మొదలయ్యి కత్తి పడవులుగా మారి ఎర్రపంచ నుంచి బయట కొబ్బరి చెట్ల వరకు వైజాగ్ పోర్టులా తయారు అయ్యేది.ఓ సారి అలానే ఏ పుస్తకమో చూసుకోకుండా తాతయ్య గారి ఫోన్ బుక్ చింపేశాము:). వర్షం పడిన రోజు చీకటి పడుతూండంగానే రోజూ వచ్చే మిడతా ,మెనుగుని పురుగు రాగాలకి కప్పలు స్వరం కలుపుతాయి.కప్పలకి అది బొమ్మరిల్లు సినిమాలో "Ring a Ring a Roses" సిగ్నల్ లాంటిది మరి :).










మారే కాలాలతో పాటు మేము అడే ఆటలు కూడా మారిపోయేవి.గోలీలాట,బొంగరాలాట,బిల్లం కోడి క్రమం తప్పకుండా ఇప్పుడు జరుగుతున్న ఐ.పిల్.ఎల్ కి ఏమాత్రం తీసిపోకుండా సాగిపొయేవి. నానమ్మ మా కళ్ళకి గంతలు కట్టి ఆడించే విరాముష్టి నుంచి ,గుడిలో ఆడే స్తంబాలాట ,కరెంట్ షాక్ ..







ఇలా ఏ ఆట అయినా పంటలలో/రాజాలు దొంగ అయిన వాడి కధ కంచ్చికే.

దాక్కునే ఆట..ఐస్-పైస్ ఇంటి దగ్గరయితే జమ్ము చెట్టు ఆకు,గుడిలో అయితే కొనేటిలోని తామరాకు తీసుకుని వచ్చే లోపు దాక్కోవాలి అందరు.ఒక్క ఇంట్లో దాక్కుంటే వంద ఇల్లలో దాక్కునట్టే:).ఊరిలో జనాలలాగే కలసికట్టు గా ఒక దాని బుజాలపైన ఇంకోటి చేయి వేసి నట్టుగా కనిపిస్తాయి ఇల్లు. ఒక్క నిమిషంలో పాతూరు నుంచి కొత్తూరికి నేల పైన కాలు పెట్టకుండా వెల్లిపోవచ్చు.







ఎండాకాలం అంటే ఈతా, తాటికాయలు...

వేసవి సెలవులలో ఈత కొట్టి మామిడి కాయలు దొంగలించి ,తాటి ముంజలు కుమ్మేసి కాని ఇంటికి చేరే వాల్లమి కాము... మండుటెండలో ఇరవై అడుగుల పై వున్న మొటారు షెడ్డుపై నుంచి దూకితే,పాదాలు మొదట నిటిని తకుతూ మొహం నిటిలో మునిగితే.అది మరో లోకమే ఇక.

బాడా బావి నుంచి , పాముల బావి వరకు ఈత కధలు ఒకటి కాదులే.....






ఏ పండుగయినా క్యాలెండరు చూసి తెలుసు కోనక్కర్లేదు, ఊరు ఊరంతా అందంగా సింగారించుకుంటుంది...

సంక్రాంతి అయితే అరిసెలు,కల్యప తరువాత ముగ్గుల పోటీలు
బోగికికి తాటాకులు,త్యాగలు...
దసరా అంటే పులి వేషాలు,రక రకాల పిండి వంటకాలు..











ఇక ఏట ఓ సారి జరిగే తిర్నాళ్ళ ఎంతో వైభవంగా జరుగుతుంది.ఊరు ఊరంతా ఎకమై రధాన్ని లాగుతూ చెన్నకేసవ స్వామి సేవలో మునిగి పోతారు.



ఈతకాయలు,కలేకాయలు,రేగికాయలు ఎవయినా డబ్బులు ఇవ్వకుండానే కొనేయొచ్చు.వడ్లు/బియ్యం ఇస్తే చాలు.గ్లాసు నిండుగా బియ్యం ఇస్తే గ్లాసు నిండుగా ఈతకాయలు...

సైకిలులో వచ్చే మిఠయి అంటే మాకు ఎంతో ఇష్టం.దానికి కూడా డబ్బులు అక్కర్లేదు,పనికి రాని ఇనప సామాన్లు ఇస్తే చాలు.

ఓసారి అలానే బర్రెల కొట్టాం గొల్లెం మిఠాయికి ఇచ్చేసి నానమ్మ దీవెనలు అందుకున్నాం:)


చీకటి పడుతూండగానే, నానమ్మకి తెలియ కుండా సెట్టెమ్మ కొట్లో తెచ్చుకున్న బోండాలు,ఎర్ర కారంతో తింటే గాని నిద్ర పట్టేది కాదు మాకు.మేడ పైన వరుసగా పరుపులు వేసుకుని ఆకాశంలో కనిపించే కొట్ల తారలతో పాటు రక రకాల వింతల గురించి ఎవరికి తోచిన కధలు వాల్లు చెప్తూ నిద్రలోకి జారుకుంటాం...

To my vinjamoor with love.

నాని