Friday, September 26, 2008

మదురానగరిలో 2:-నీ తొలి చూపులో నన్ను నేను మరచినా..





నా మొదటి ప్రేమ లెఖ రాసి రెండు వారాలు అయింది.కనిపెడతాం అంటూ వెళ్ళిన మా రేంజర్లు దొంగలతో రన్నింగ్ రేస్లో వోడిపోయిన పోలీస్ మొహాలతో తిరిగి వచ్చారు.

లొకేషన్:-భాగ్యనగరం,వెంగల్ రావ్ నగర్ చౌరస్తా
సమయం:-కారు మబ్బులు అకాశాన్నీ/మనసునీ కమ్మిన వేల...

రోజూలానే
క్రికెట్ అవ్వగానే పాని పూరి తినాలని బయలుదెరాము నేను మా భక్క శీనుగాడు నా చేతక్(బజాజ్) మీద.నా స్కూటర్, అంటే మా పెదనాన్న గారు 1978లో మా నాన్న గారికి ఇస్తే,నాకు సంక్రమించిన మాస్టర్ పీస్ .దాని పైన వెల్తూ వుంటే అందరు మమ్మల్నే చూస్తుంటారు.పిల్లలు ఇదెదో కొత టైపు ద్విచక్ర వాహనమని.పెద్దలు ఇలాంటివి ఇంకా తయారు చేస్తున్నారా అని.

మా
ఇంటి దగ్గర ఐతె రూపయకి మూడే అని ఇక్కడయితే నాలుగు పాని పూరిలు వస్తాయని,మదురా నగర్<->వెంగల్ రావ్ నగర్ చౌరస్తా దగ్గర వున్న గప్-చుప్ బండికి తీసుకొచ్చాడు శీనుగాడు.


ఎమి తింటావురా శీను...
కట్లెట్ ,సమోసా, పాని పూరి,భెల్ పూరి,దహి పూరి...

అవన్ని నువ్వు పర్స్ మర్చిపోని రోజు ఆర్డర్ చేద్దాం గాని రెండు సమొసా చెప్పు.
శీను ఆర్డర్ చెసే లోపే అమ్మయి వచ్చి టూ ప్లేట్ దహి పూరి సలీమన్నా అని చెప్పి పక్కనే స్కూటి దగ్గర వున్న తన ఫ్రెండ్ దగ్గరకి వెళ్ళింది...

శీనుగాడు అభోవ్ సూపరు ఫాస్టు అంటుండగానే , నేను స్కూటి దగ్గర వుండే అమ్మాయిని చూస్తూ...

తనే రా...

ఎంటీ?

తనే
రా...

అవును
రొయ్...

యెత్తు 5'6"
ఒకే

కలర్ 'చామంచ్చాయ ' ఒకే....

కాని
వైట్ డ్రస్ వేసుకోలేదు మామ... ఆర్ యు స్యూర్?

నేను
అమ్మయి వైపే చూస్తూ , తను తిన్న ప్లేట్లోనే తినాలని వెయిట్ చేసే లోపు సీను గాడు రెండో రౌండ్ కి రెడి అయ్యాడు...


అలా చూస్తూ వుండగానే తన స్కూటి స్టార్ట్ చేసింది,మేము "హమారా బజాజ్.." స్టార్ట్ చేసాము...





ఇలా వెనకాల నుంచి దొంగ చాటూగా ఫాలో అవుతున్నాం అని ఫీల్ అవ్వకు రా ,ఏదో ఒక రోజు నీ స్కూటరులో నువ్వు ముందు ,పోరి వెనకాల...

అంటే జీవితాంతం నాకు ఈ స్కూటరే అని డిసైడ్ అయ్యిపొయ్యావా...
అప్పటివరకూ తనకి యేమి తెలినట్టే వున్నా,స్కూటి ఇంటి మెట్ల పక్కన పార్క్ చేసి , పరిహాసం చెస్తున్న తన ఫ్రెండ్తో లోపలకి వెల్తూ నావైపు చూసిన తొలి చూపు....

కంటి చూపుతో చంపేయడం అంటే ఇదేనెమో అన్నాడు శీను నా వైపు చూస్తూ.
ఆ నిమిషం 'మెరుపెదో నా మీద ప్రసరించలే..' అనట్టు అనిపించింది. తల పైకెత్తి ఆకశం వైపు చూడగానే...


నుదిటి మీద మొదటి చినుకు...


"ఆ నింగిని వీడి,చినుకల్లే నను చేరి.."






అప్పుడెప్పుడో హైదరాబాదు విమానాశ్రయం పైన మాత్రమే పడినట్టు, నాకోసమే ,నా మీదే పడుతోంది వానంతా అనిపిచింది.
"వరదల్లే మారి,ని ప్రెమలో ముంచెత్తావే వయ్యారి..."


శీనుని నడచి వెళ్ళమని చెప్పి :),అక్కడే వుండిపోయాను ఇంటి కిటికీ వైపు చూస్తూ...


"ని ప్రేమసాగరంలో పయనం,తెలియనీదె సమయం..."

రోజు రాత్రి :- 102 జ్వరం వచ్చేలా వర్షంలో ఎందుకు తడిచావ్ నాన్నా అని అమ్మ అంటుంటే నాకు మటుకు ' ఎక్కడికో వెల్లిపొయననే ' ఫీలింగ్లో తన తొలి చూపునే రివైండ్/ప్లె చేసుకుంటూ రాసిన చిన్ని లేఖ.


"అదుపే లేని నా వేగం,చెరాలే నా ఊహా లోకం..."

నా->ని