Friday, April 25, 2008

ఈత ,simming వచ్చు అంకుల్....



"ఓ నాని గాడి ఈత కధ కాదు సొధ.."
నాకు నీళ్ళు చూడగానె బ్యాక్ గ్రౌండ్ లో దుకెయ్!! దూకెయ్!! అనె సౌండ్ వినిపిస్తువుంట్టుంది.

దీనికి కారణం @@@, మా జీప్ టైరు తిరిగితె(ఫ్లాష్ బాక్)...

1989 నెల్లూరు మైపాడు బీచ్ లో మా నాన్న గారిని ఫాలొ అయ్యి సముద్రం లోతు చూద్దాం అనుకున్న నన్ను,తమ్ముడిని ఆపి లక్ష్మణ రేఖ గీసారు మా పెద్దవాళ్ళు.అలలు ఆగక పొవడంతో ఆ 'రేఖ ' మాకు ఎప్పుడూ కనిపించలేదు అనుకోండి.

1994:- సమయం రానె వచ్హింది. ఈత నెర్చుకోవాలీ అనె కోరికతొ,ఎప్పటిలానె వేసవి సెలవులకి నెల్లూరు జిల్లా లోని మా వింజమూరుకి వెళ్ళాం.

Day1
మొనగ చెట్టు కర్రలు వీపుకు కట్టుకుంటె పసిఫిక్ మహాసముద్రం కూడ ఈదేయొచ్హు అని తెలిసింది.

మొనగ కర్రలు:- అవి మునగవ్ మనల్ని మునగనియ్యవ్.

30 అడుగుల పైన వుండె మొటారు షెడ్ పైకి ఎక్కి నా మిత్రులంద్దరు దూకుతుంటె చూసి త్వరగ నెర్చుకోవాలి అనిపించింది ఈత.


Day2

మొదటి సారి జీవితం లొ భావి లొతెంతో నాకు తెలిసింది. తమ్ముడు 4 మెట్లు ఎక్కి డైవ్ చేసాడు,అందరు సూపర్ అన్నారు.నెను తగ్గుతాన ,6 మెట్లు ఎక్కి దూకాను.అదెంటొ నాతో పాటు అందరూ దూకారు.


మొనగ కర్రలు:- అవి తెలాయి నన్ను ముంచ్హాయి.


ఈ విషయం అమ్మకి తెలియనే తెలిసింది,మీరు ఊహించ్ని నట్టె భావి ఈతకి తెర పడ్డింది.నెల్లూరు కి తీస్కొచి "The Club" లొ చెర్చెసారు,అది అప్పుడు స్కూల్ లో వో స్టెటస్ సింబల్.15 రొజులలో ఈత వచ్హెసింది.

కాని అక్కడితో ఆగ లెదు.రకరకాల ఈతలు

butterfly,frog,Sidestroke,float,Backstroke etc ,నేర్చుకున్నాను నేర్పించాను కూడ:).అప్పటినుంచి ఇప్పటివరకు బాక్ గ్రౌండ్ సౌండ్ వినిపించ్హిన ప్రతి సారి ఎప్పుడు దాన్ని డిసప్పోఇంట్ చెయ్యలెదు.


పూర్వ జన్మ లో నెను ఘల్లీవర్(gulliver) నేమొ అనుకునె లోపె ఇ జన్మ లో మాత్రం తక్కువేమీ కాదనె మిత్రులున్నారనుకోండి(నా పొడవు చూసి).

నాకు నచ్చిన మెము మెచ్చిన ఈత ప్రదేశాలు ...

వింజమురు బావులు,మైపడు బీచ్ ,ముర్డెస్వర్ బీచ్, అట్లాంటిక్ బీచ్ ,ఎ బీచ్ అయిన.. The క్లబ్(నెల్లూరు),హైదరాబాద్ "East Club",J.N.N.C.E hostel water ట్యాంక్:)